Himachal Pradesh Floods : ఆకస్మిక వరదలతో 13 మంది మృతి
పొంగుతున్న వాగులు..వంకలు
Himachal Pradesh Floods : హిమాచల్ ప్రదేశ్ లో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో 6 మంది దుర్మరణం పొందారు.
వరదల తాకిడికి 13 మంది చని పోయారని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ మృతి చెందిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు చని పోయిన వారందరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులతో కలిసి భారత సైనిక దళాలు కాంగ్రాలో 11 మంది పౌరులను రక్షించారు. మరో వైపు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.
భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు(Himachal Pradesh Floods) సంభవించాయి. కొండ చరియలు విరిగి పడడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని హమీర్ పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకు పోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
బాధిత జిల్లాల్లో పరిపాలన యంత్రాంగం సహాయక చర్యలలో నిమగ్నమై ఉందని వెల్లడించింది. చంబా జిల్లాలో అకాల వర్షం తాకిడికి ఇల్లు కూలి పోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
ఇక మండిలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆకస్మిక వరదలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది.
Also Read : కాంగ్రాలో కూలిన రైల్వే వంతెన