Jhulan Goswami : రిటైర్ కానున్న ఝుల‌న్ గోస్వామి

ఇంగ్లాండ్ తోనే ఇక ఆఖ‌రి సీరీస్

Jhulan Goswami : భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో మ‌రో దిగ్గ‌జ క్రికెట‌ర్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు భార‌త వెట‌ర‌న్ పేస‌ర్ ఝుల‌న్ గోస్వామి.

త‌న కెరీర్ లో ఇంగ్లండ్ తో జ‌రిగే మూడో వ‌న్డేనే త‌న కెరీర్ లో ఆఖ‌రి మ్యాచ్ కానుంది. ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్ర‌మించ‌నున్నారు.

ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నారు ఝుల‌న్ గోస్వామి. ఇదిలా ఉండ‌గా భార‌త మ‌హిళా జ‌ట్టు ఇంగ్లండ్ లో ప‌ర్య‌టించ‌నుంది. సెప్టెంబ‌ర్ 24న లార్డ్స్ క్రికెట్ మైదానంలో మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

ఆ చ‌రిత్రాత్మ‌క మైదానం వేదిక‌గా తాను రిటైర్మెంట్ కానున్న‌ట్లు వెల్ల‌డించింది ఝుల‌న్ గోస్వామి. ఇదిలా ఉండ‌గా ఇంగ్లండ్ తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సీరీస్ కి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఈ టీమ్ లో చోటు ద‌క్కించుకుంది ఝుల‌న్ గోస్వామి. ఈ ఏడాదిలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ఝుల‌న్ గోస్వామికి(Jhulan Goswami) విశ్రాంతి ఇచ్చారు. ఆపై శ్రీ‌లంకతో జ‌రిగిన సీరీస్ లో కూడా ఆమెను ఎంపిక చేయ‌లేదు.

కాగా మ‌హిళ‌ల క్రికెట్ లో అన్ని ఫార్మాట్ ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన క్రికెట‌ర్ గా ఝుల‌న్ గోస్వామి రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం ఆమె మూడు ఫార్మాట్ లు (టెస్టులు, వ‌న్డేలు, ఓడీఐలు) క‌లిపి 352 వికెట్లు తీసింది ఝుల‌న్ గోస్వామి.

మ‌రో వైపు ఇదే ఏడాది త‌న స‌హ‌చ‌రురాలు మిథాలీ రాజ్ అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది.

Also Read : వ‌న్డే సీరీస్ పై క‌న్నేసిన భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!