Taliban Detain : తాలిబన్ల అదుపులో ఫిల్మ్ మేకర్..జర్నలిస్ట్
వెంటనే విడుదల చేయాలని అమెరికా డిమాండ్
Taliban Detain : ప్రపంచం ఎంత చెప్పినా తన తీరును మార్చు కోవడం లేదు ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు. అమెరికన్ జర్నలిస్ట్ , స్వతంత్ర చిత్ర నిర్మాత ఐవోర్ షియరర్ , ఆఫ్గనిస్తాన్ నిర్మాత ఫైజుల్లా ఫైజ్ బక్ష్ లను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవలే వియాన్ టీవీ చానల్ కు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ ను కూడా తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. దీంతో ప్రాణ గండం తప్పింది. తాలిబన్లు తమ ఛాందసవాదాన్ని పట్టుకుని వేలాడుతున్నారు.
ఈ తరుణంలో నిర్మాత, జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. ఐవోర్ షియరర్ , ఫైజ్ బక్ష్ లను వెంటనే విడుదల చేయాలని న్యూయార్క్ కు చెందిన మీడియా వాచ్ డాగ్ తాలిబన్లకు(Taliban Detain) పిలుపునిచ్చింది.
ఇది మంచి పద్దతి కాదని సూచించింది. సినిమా, మీడియా అన్నది సమాజాన్ని ప్రతిబింబించేలా చేస్తాయని వాళ్లు ఎన్నటికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.
వృత్తి ధర్మంలో భాగంగా తమ విధులు నిర్వర్తించారని ఈ సమయంలో కిడ్నాప్ లేదా అదుపు లోకి తీసుకోవడం వల్ల ఆఫ్గనిస్తాన్ కు మరింత చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేసింది వాచ్ డాగ్.
ఆగస్టు 17న షియరర్ , ఫైజ్ బక్ష్ కాబూల్ లోని డిస్ట్రిక్ట్ 10 లోని షేర్పూర్ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. యుఎస్ డ్రోన్ దాడిలో ఆగస్టులో అల్ ఖైదా నాయకుడు ఐమల్ అల్ జవహరి మరణించారు. అయితే వారు అమెరికన్ గూఢచారులంటున్నారు తాలిబన్లు.
Also Read : లిజ్ ట్రస్ టాప్ లో ఉన్నా విక్టరీ నాదే