Arvind Kejriwal : ఇలాగైతే కష్టం దేశానికి నష్టం – సీఎం
ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal : కేంద్ర సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . ప్రస్తుతం కేంద్రం బిజీగా ఉందని బీజేపీయేతర ప్రభుత్వాలను ఎలా ఇబ్బంది పెట్టాలన్న దానిపై.
తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీని గతంలో కొలువు తీరిన లెఫ్టినెంట్ గవర్నర్ క్లియర్ చేశారని చెప్పారు. ఒకవేళ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటే ఇలా ఎందుకవుతుందని ప్రశ్నించారు.
అయితే తాజాగా బైజాల్ స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సక్సేనా మొదటి నుంచీ ఆప్ సర్కార్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మోదీని టార్గెట్ చేశారు. ఇలాగైతే దేశం ఎలా పురోగమిస్తుందని ప్రశ్నించారు. వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల తమకు ఏమీ కాదన్నారు.
మీరు ఎంతగా ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు పన్నినా , జిమ్మిక్కులు చేసినా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు.
ఒకవేళ తాము అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి ఉంటే రెండోసారి తమను ఢిల్లీ ప్రజలు ఎన్నుకునే వారు కాదని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
సీబీఐ తాజాగా దాడులు చేసింది, సోదాలు చేపట్టింది. కానీ వారికి ఎలాంటి ఆధారం లభించలేదన్నారు. చివరకు మొబైల్ , కంప్యూటర్లు, ల్యాప్ టాప్ తీసుకు వెళ్లారని తెలిపారు.
తనపై కూడా పలుమార్లు సోదాలు జరిగాయి. కానీ ఒక్కటి కూడా దొరక లేదని గుర్తు చేశారు. వ్యక్తిగత దురుద్దేశంతో దాడులకు పాల్పడడం మంచి పద్దతి కాదని సూచించారు.
Also Read : ప్రభుత్వాల కూల్చివేతలో మోదీ బిజీ