Imran Khan : ఇమ్రాన్ ఖాన్ కు షాక్ కేసు నమోదు
రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపణ
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన స్పీచ్ లో అత్యున్నత పోలీస్ అధికారులను, మహిళా అదనపు సెషన్స్ జడ్జిని భయభ్రాంతులకు గురి చేశారంటూ ఆరోపించారు.
ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి ప్రసంగం పోలీసులు, న్యాయమూర్తులను భయం కలిగించేలా చేసిందంటూ స్పష్టం చేసింది.
పీటీఐ పార్టీ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టారు. న్యాయ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలను బెదిరింపులకు గురి చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్లు పీటీఐ వెల్లడించింది.
జాతీయ రాజధాని ఎఫ్-9 పార్క్ లో జరిగిన సభలో రెచ్చగొట్టేలా ప్రసంగించారని తెలిపింది. 69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ దేశ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా చెప్పారు.
ఆయన ప్రస్తావించిన కొన్ని గంటలకే ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు కావడం గమనార్హం. పీటీఐ తెలిపిన ప్రథమ సమాచార నివేదిక ప్రకారం ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్ 7 కింద ఇస్లామాబాద్ లోని మర్గల్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కు అనుచరుడిగా పేరొందిన షాబాజ్ గిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు ఇమ్రాన్ ఖాన్.
Also Read : వ్యాపారిని పెళ్లాడిన షెరిల్ శాండ్ బర్గ్