Rakesh Tikait Detained : రైతు నేత రాకేశ్ టికాయత్ అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసన
Rakesh Tikait Detained : భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో పేరుకు పోయిన నిరుద్యోగాన్ని నిర్మూలించాలని, ఖాళీగా ఉన్న 15 కోట్ల జాబ్స్ భర్తీ చేయాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జంతర్ మంతర్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టనుంది.
దీంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు బయలు దేరిన రాకేశ్ టికాయత్(Rakesh Tikait) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనను ఘాజిపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు రైతు సంఘం నాయకులు. తాము ప్రభుత్వాన్ని కూల్చడం లేదని, కేవలం న్యాయ పరమైన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాకేశ్ టికాయత్.
ఇదిలా ఉండగా రైతు అగ్ర నాయకుడిని ఢిల్లీ లోని మధు విహార్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అదుపులోకి తీసుకున్న విషయాన్ని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిపేంద్ర పాఠక్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులు కేంద్రం ఆదేశాల మేరకే తమ ఆందోళనను అడ్డుకుంటున్నారని రాకేశ్ టికాయత్ ఆరోపించారు.
చివరి శ్వాస ఉన్నంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు రాకేశ్ టికాయత్. తన అరెస్ట్ కొత్త విప్లవానికి నాంది పలుకుతుందన్నారు.
Also Read : రైతుల ఆందోళనతో ఖాకీలు అలర్ట్