Rakesh Tikait : నన్ను చంపినా సరే పోరాటం ఆపను
కేంద్రంపై టికాయత్ తీవ్ర ఆగ్రహం
Rakesh Tikait : తనలో ప్రాణం ఉన్నంత వరకు తాను పోరాడుతూనే ఉంటానని హెచ్చరించారు రైతు అగ్ర నాయకుడు రాకేశ్ టికాయత్. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన రాకేశ్ టికాయత్(Rakesh Tikait) ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. కొన ఊపిరి ఉన్నంత దాకా తాను పోరాటం ఆపనని ప్రకటించారు. ఆయన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు.
నిరుద్యోగులు, యువత, రైతులు, కూలీలపై అణచివేతకు మోదీ(PM Modi) పూనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్దం కావాలని రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు.
దేశంలో 15 కోట్లకు పైగా ఖాళీలు ఉన్నాయని కానీ ఈరోజు వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ వెళుతున్న కేంద్రం చివరకు రక్షణ శాఖలో కాంట్రాక్టు వ్యవస్థకు శ్రీకారం చుట్టడం దారుణం అన్నారు.
ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు టికాయత్. ప్రధానంగా అన అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు.
ఎన్ని సార్లు అరెస్ట్ చేసినా తాను భయపడనని , చంపినా పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. ఎంత మంది పోలీసులను మోహరించినా జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగుతుందన్నారు.
Also Read : రైతు నేత రాకేశ్ టికాయత్ అరెస్ట్