Arvind Kejriwal : పడగొట్టడంలో మోదీ ప్రభుత్వం టాప్
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రధాన మంత్రి వాటిని గాలికి వదిలి వేశారంటూ ఆరోపించారు.
ఇక బీజేపీయేతర ప్రభుత్వాలను ఎలా పడగొట్టాలనే దానిపై ఫోకస్ పెట్టారని, అందులోనే తల మునకలై ఉన్నారంటూ నిప్పులు చెరిగారు.
తాజాగా ఆప్ ను విడదీస్తే , ప్రభుత్వం పడి పోతుందని , బీజేపీలో చేరితే ఎలాంటి కేసులు ఉండవంటూ తనకు మెస్సేజ్ కూడా వచ్చిందంటూ డిప్యూటీ సీఎం మనీష సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా సోమవారం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీపై సీబీఐ ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం ఇంటితో పాటు దేశ వ్యాప్తంగా 31 చోట్ల సోదాలు నిర్వహించింది. మరో వైపు 14 గంటల పాటు సోదాలు చేపట్టిన సీబీఐ సిసోడియాకు చెందిన మొబైల్ తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను సీజ్ చేసింది.
సిసోడియా విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇదంతా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు. కేంద్రం కావాలని కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. రూపాయి విలువ పడి పోతోంది. నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉందని ఎద్దేవా చేశారు.
Also Read : బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ – సిసోడియా