ISIS Bomber : భారత్ లో ఉగ్రదాడికి సూసైడ్ బాంబర్ ప్లాన్
అదుపులోకి తీసుకున్న రష్యా ఏజెన్సీ
ISIS Bomber : భారత పాలక వర్గాలకు చెందిన ఒకరిపై తనను తాను పేల్చేసు కోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ఐసిస్ బాంబర్ ప్లాన్(ISIS Bomber) చేసిన వ్యవహారం గుట్టు రట్టయ్యింది.
అదుపులోకి తీసుకున్న వారిని టర్కీలో ఐసిస్ రిక్రూట్ చేసినట్లు సమాచారం. భారత నాయకత్వ ప్రముఖుల్లో ఒకరిపై ఉగ్రదాడికి పాల్పడాలని ప్లాన్ చేశారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ను తమ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎఫ్ఎస్బీ) సోమవారం వెల్లడించింది.
ఈ విషయాన్ని అధికారికంగా రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ ధ్రువీకరించింది. రష్యాలో నిషేధించబడిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించింది.
ఆ మేరకు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని నిర్బంధించినట్లు ఎఫ్ఎస్బీ తెలిపింది. పట్టుకున్న అతడు మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తి.
పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని స్కెచ్ వేశాడు.
ఈ ప్లాన్ అమలు చేయాలని అనుకుంటున్నది భారత్ లోనని రష్యా ఏజెన్సీ సంచలన విషయం వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని టర్కీలో ఆత్మాహుతి బాంబర్ గా ఐసిస్ రిక్రూట్ చేసింది.
ఇదిలా ఉండగా ఈ సూసైడ్ బాంబర్ ప్రధాన లక్ష్యం భారత దేశంలో పేరొందిన ప్రముఖ లీడర్ ను మట్టు బెట్టాలని ప్లాన్ చేశాడు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మాతృ సంస్థగా పేరొందింది ఐసిస్.
Also Read : ఫిఫాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు