Dilip Ghosh : దిలీప్ ఘోష్ షాకింగ్ కామెంట్స్

అంచ‌నా ఉండ‌డం వ‌ల్లే ఈడీ దాడులు

Dilip Ghosh : ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దిలీప్ ఘోష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎందుకు దాడులు చేస్తున్నాయ‌నే దానిపై క్లారిటి ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

బెంగాల్ కు ఎందుకు పంపార‌నే దానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బొగ్గు కుంభ‌కోణం, ప‌శువుల అక్ర‌మ ర‌వాణా కేసు , పాఠ‌శాల ఉద్యోగాల కుంభ‌కోణం , త‌దితర స్కామ్ లు చోటు చేసుకున్నాయ‌ని అందుకే దాడులు, సోదాలు చేప‌ట్టాయ‌ని చెప్పారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే సీబీఐ లోని కొంత మంది అధికారుల‌ను బెంగాల్ నుంచి బ‌దిలీ చేశార‌ని దిలీప్ ఘోష్ వెల్ల‌డించారు.

రాష్ట్రంలోని అవినీతిపై ద‌ర్యాప్తు చేసేందుకు ఈడీని పంపిన‌ట్లు దిలీప్ ఘోష్(Dilip Ghosh)  తెలిపారు. కోల్ క‌తాలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు.

ప‌శ్చిమ బెంగాల్ లోని సీబీఐ అధికారుల‌కు టీఎంసీకి మ‌ధ్య ఉన్న బంధం ఉన్న కార‌ణంగానే ఏజెన్సీ చేసిన ద‌ర్యాప్తులు ఎటువంటి ఫ‌లితాలు రావ‌డం లేద‌న్నారు.

కొంత మంది సీబీఐ అధికారులు, కొంద‌రు ల‌క్ష‌ల్లో , మ‌రికొంద‌రు అమ్ముడు పోయారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు దిలీప్ ఘోష్. ఈ అమ్ముడు పోవ‌డం చివ‌ర‌కు కోట్ల‌ల్లో చోటు చేసుకుంద‌ని ఎంపీ ఆరోపించారు.

ప్ర‌స్తుతం దిలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేర‌కు ఈడీ ప‌ని చేయ‌డం ప్రారంభించింద‌న్నారు. పెంపుడు కుక్క‌ల్లా దాన్ని నియంత్రించ లేమ‌న్నారు.

కేంద్ర హొం మంత్రిత్వ శాఖ‌కు నివేదించిన సీబీఐలోని కొంత మంది అధికారుల‌ను బెంగాల్ వెలుప‌లికి ఎందుకు బ‌దిలీ చేశారంటూ దిలీప్ ఘోష్ చేశారు.

Also Read : భార‌త్ లో ఉగ్ర‌దాడికి సూసైడ్ బాంబ‌ర్ ప్లాన్

Leave A Reply

Your Email Id will not be published!