CM KCR : మ‌హాత్ముడు..మ‌హ‌నీయుడు..ఆద‌ర్శ‌ప్రాయుడు

ఈ త‌రం పిల్ల‌ల‌కు గాంధీ గురించి తెలియాలి

CM KCR :  దేశానికి స్వ‌తంత్రం తీసుకు వ‌చ్చిన మ‌హ‌నీయుడు మ‌హాత్ముడి గురించి తెలుసు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు సీఎం కేసీఆర్. నిన్న‌టి త‌ర‌మే నేటి త‌రం రాబోయే త‌రాల పిల్ల‌లు విధిగా గాంధీజీ గురించి తెలుసు కోవాలని స్ప‌ష్టం చేశారు.

దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతోంది. అయినా నేటికీ పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాల‌కులు మారినా , త‌రాలు మారినా నేటికీ ఉన్న చోట‌నే దేశం ఉంద‌న్నారు.

కులాలు, మ‌తాలు, జాతులు, వ‌ర్గాల పేరుతో దేశం అల్ల‌క‌ల్లోలంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు.

ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎరుక‌తో ఉండాల‌ని హెచ్చ‌రించారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసి కేవ‌లం కార్పొరేట్ల‌కే క‌ట్ట‌బెడుతున్న దుష్ట సంప్ర‌దాయానికి కేంద్రం తెర తీసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఈ త‌రుణంలో దేశానికి చెందిన ఆస్తుల‌ను ప‌రిర‌క్షించు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రి మీద ఉంద‌ని గుర్తు చేశారు కేసీఆర్(CM KCR).

క‌వులు, క‌ళాకారులు, మేధావులు, బుద్ధి జీవులు, త‌త్వ‌వేత్త‌లు, విభిన్న రంగాల‌కు చెందిన వారంతా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు కేసీఆర్.

శాంతి అనే ఆయుధాన్ని ఈ ప్ర‌పంచానికి అందించిన మ‌హ‌నీయుడు పుట్టిన ప‌విత్ర‌మైన నేల భార‌త దేశం అని కొనియాడారు.

సుదీర్ఘ కాలం పాటు సాగిన దేశ స్వాత్రంత్ర ఉద్య‌మ చ‌రిత్ర గురించి త‌ప్ప‌క తెలుసు కోవాల‌ని సూచించారు. మ‌హ‌నీయులు, మ‌హానుభావుల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని అన్నారు కేసీఆర్.

Also Read : ఆ ఇద్ద‌రికీ భార‌త్ కు కెప్టెన్ అయ్యే చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!