Manish Sisodia : బీజేపీ ఆఫర్ ఆడియో రెడీగా ఉంది
ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
Manish Sisodia : ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని చీల్చాలని, తమ పార్టీలో చేరితే ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులన్నీ మాఫీ చేస్తామంటూ తనకు బంపర్ ఆఫర్ బీజేపీ ఇచ్చిందంటూ సంచలన కామెంట్స్ చేశారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
ఇందుకు సంబంధించి తాను తల నరుక్కుంటానని కానీ తల వంచను అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. దీనిని కొట్టి పారేసింది బీజేపీ.
మరో వైపు దేశంలో అత్యంత అవినీతి పరుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
మరోవైపు మద్యం పాలసీలో మనీష్ సిసోడియా(Manish Sisodia) నామమాత్రమేనని కానీ అసలు సూత్రధారి సీఎం అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేసు నమోదు చేసింది సీబీఐ. సోదాలు చేపట్టింది.
15 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో మొదటి వ్యక్తిగా సిసోడియాను చేర్చింది. ఆయన ఇంటిపై దాడులు చేపట్టింది. 14 గంటలకు పైగా సోదాలు నిర్వహించింది.
సిసోడియా మొబైల్ తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను సీజ్ చేసింది. ఇందుకు సంబంధించి తాము ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు సిసోడియా.
ఎలాంటి విచారణకైనా సిద్దమేనని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆప్ ను గద్దె దించాలని బీజేపీ తనపై ఒత్తిడి తీసుకు వచ్చిందని ఆరోపించారు సిసోడియా.
ఇదే విషయంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తనకు రాజకీయ గురువు కేజ్రీవాల్ అంటూ పేర్కొన్నారు.
Also Read : నేను ప్రధాని పదవి రేసులో లేను