Supreme Court : గుజ‌రాత్ స‌ర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసు

సెత‌ల్వాద్ బెయిల్ పిటీష‌న్ పై ధ‌ర్మాస‌నం

Supreme Court : గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. సామాజిక కార్య‌క‌ర్త గా పేరొందిన తీస్తా సెత‌ల్వాద్ బెయిల్ పిటిష‌న్ పై ఈ నోటీసు జారీ చేసింది.

2002 గుజ‌రాత్ అల్ల‌ర కేసుల్లో అమాయ‌కుల‌ను ఇరికించేందుకు క‌ల్పిత సాక్ష్యాల‌ను రూపొందించేందుకు జూన్ లో తీస్తా సెత‌ల్వాద్ ను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ యు. యు. ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం సెత‌ల్వాద్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఆగ‌స్టు 3న గుజ‌రాత్ హైకోర్టు ఈ పిటిష‌న్ పై ప్ర‌భుత్వానికి జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ కేసుకు సంబంధించి వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 19కి విచార‌ణ వాయిదా వేసింది. దీనికి ముందు జూలై 30న అహ్మ‌దాబాద్ లోని సెష‌న్స్ కోర్టు ఈ కేసులో సెత‌ల్వాద్ , మాజీ డైరెక్ట‌ర జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ఆర్. బి. శ్రీ‌కుమార్ ల బెయిల్ ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించింది.

వారి విడుద‌ల త‌ప్పు చేసిన వారికి ఒక వ్య‌క్తి శిక్షార్హ‌త లేకుండా ఆరోప‌ణ‌లు చేసి త‌ప్పించు కోవ‌చ్చ‌ని సందేశం పంపుతుంద‌ని పేర్కొంది.

జూన్ లో అరెస్ట్ అయిన సెత‌ల్వాద్ , ఆర్బీ శ్రీ కుమార్ గోద్రా అనంత‌ర అల్ల‌ర్ల కేసుల్లో అమాయ‌కుల‌ను ఇరికించేందుకు క‌ల్పిత సాక్ష్యాల‌ను సృష్టించారంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా మూడో నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భ‌ట్ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోలేదు. ఈ కేసులో అరెస్ట్ అయ్యాక భ‌ట్ అప్ప‌టికే మ‌రో క్రిమిన‌ల్ కేసులో జైలులో ఉన్నాడు.

Also Read : బిల్కిస్ దోషుల విడుద‌లపై ‘సుప్రీం’ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!