Supreme Court Ramdev Baba : రామ్ దేవ్ బాబాపై సుప్రీం సీరియస్
ఇతర వైద్య వ్యవస్థలను గౌరవించాలి
Supreme Court Ramdev Baba : ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబాకు షాక్ ఇచ్చింది కోర్టు(Supreme Court Ramdev Baba). ఇతర వైద్య వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించింది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మంగళవారం విచారణ చేపట్టంది. రామ్ దేవ్ బాబా(Ramdev Baba) అల్లోపతి, ఇతర వైద్య విధానాలను దుర్వినియోగం చేసేరీతిలో ఉండకూడదని పేర్కొంది. తనను తాను నిగ్రహించు కోవాలని స్పష్టం చేసింది.
పతంజలి ఉత్పత్తులకు అనుకూలంగా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఇతర వైద్య వ్యవస్థలను తూలనాడడం, అవి పనికి రావని చెప్పడం మంచి పద్దతి కాదని హితవు పలికింది.
కరోనా కష్ట కాలంలో మీరు కూడా ఏ వైద్యాన్నిచులకన చేశారో దానితోనే చికిత్స పొందారనే విషయాన్ని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది.
ప్రత్యేకంగా అల్లోపతి వైద్యాన్ని అవహేళన చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది ధర్మాసనం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి,
పతంజలి ఆయుర్వేదానికి నోటీసులు జారీ చేస్తూ పతంజలి జారీ చేసిన అనేక ప్రకటనల కంటెంట్ పై ధర్మాసనం మినహాయింపునిచ్చింది.
వైద్యులను, ఇతర వైద్య విధానాలను ఎందుకు దుర్వినియోగం చేయాలి. యోగాను ప్రతిపాదించినందుకు గౌరవిస్తాం. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించడాన్ని, తూలనాడడాన్ని మాత్రం ఆమోదించ బోమంటూ స్పష్టం చేసింది ధర్మాసనం.
మీరు చెబుతున్నట్లుగా ప్రచారం చేస్తున్న మందులు అన్ని వ్యాధులను ఎలా నయం చేస్తుందని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు న్యాయమూరర్తులు జస్టిస్ సీటీ రవి కుమార్ , హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం.
Also Read : శివసేన పార్టీ గుర్తుపై 25 వరకు గడువు