Arvind Kejriwal : మమ్మల్ని చూసి బీజేపీ జంకుతోంది
ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
Arvind Kejriwal : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను చూసి బీజేపీ భయాందోళనకు లోనవుతోందన్నారు. గుజరాత్ టూర్ లో భాగంగా కేజ్రీవాల్ ప్రసంగించారు.
గత 27 సంవత్సరాలుగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలన సాగిస్తోంది. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారి పోయిందని ఆరోపించారు. ప్రధానంగా నియామక స్కాంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) .
బీజేపీ కనుసన్నలలోనే ప్రశ్నాపత్రాల లీకేజీ చోటు చేసుకుందని ఆరోపించారు. తాము పవర్ లోకి వస్తే నిందితులను వదిలే ప్రసక్తి లేదన్నారు. వారిని బహిరంగంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఆప్ పూర్తిగా త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది గుజరాత్ లో . మహాత్మా గాంధీ, పటేల్ జన్మించిన ఈ నేల మీద డ్రగ్స్ దందా జోరుగా కొనసాగడం దారుణమన్నారు సీఎం.
ఒక్కసారి ఆప్ కు ఛాన్స్ ఇస్తే గనుక రాష్ట్రంలో 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 భృతి కల్పిస్తామన్నారు.
అయితే ఆప్ కు రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణను చూసి బీజేపీకి భయం పట్టుకుందన్నారు. లేనిపోని కేసులు నమోదు చేసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు.
విద్య, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా భద్రత, వ్యవసాయం రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు ఆప్ చీఫ్. త్వరలోనే తమ దెబ్బకు తట్టుకోలేక బీజేపీ రాష్ట్ర చీఫ్ ను కూడా తొలగించ బోతోందంటూ జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : మోదీని ఎవరైనా కాదనగలరా