JNU VC : జేఎన్‌యూ వీసీ కామెంట్స్ క‌ల‌క‌లం

దేవ‌త‌ల‌కు కూడా కులం ఉంటుంద‌ట

JNU VC : దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌కమైన విశ్వ విద్యాల‌యంగా పేరొందింది జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీ. ఈ యూనివ‌ర్శిటీకి ఏరికోరి మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ అనుకూల‌వ‌తిగా పేరొందిన శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ ను వైస్ ఛాన్స్ ల‌ర్ గా ఎంపిక చేసింది కేంద్రం.

ఈ వీసీ ఈ మ‌ధ్య సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా ఆమె దేవ‌త‌ల‌కు కూడా కులం ఉంటుందంటూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

తాను అంబేద్క‌ర్ , లింగ న్యాయం, యూనిఫాం సివిల్ కోడ్ ను డీకోడ్ చేయ‌డం గురించి మాట్లాడుతున్నాన‌ని పేర్కొన్నారు. త‌న ఉప‌న్యాసంలో బాబా సాహెబ్ ఆలోచ‌న ఏమిటో విశ్లేషించాల‌న్నారు వీసీ.

ఇందులో ప్ర‌ధానంగా దేవ‌త‌ల కులం గురించి ప్ర‌స్తావించారు. ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీయ‌డంతో గ‌త్యంత‌రం లేక వివ‌ర‌ణ ఇచ్చు కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మ‌ను ధ‌ర్మ శాస్త్ర రీత్యా దేవుళ్లు ఉన్న‌త కులానికి చెందిన వారు కాద‌ని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. గౌత‌మ బుద్దుడి నుండి బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర‌కు క‌లిగి ఉన్న భిన్నాభిప్రాయాల‌న్నీ హిందూ మ‌తానికి చెందిన‌వేనంటూ పేర్కొన్నారు శాంతిశ్రీ ధూలిపూడి పండిట్.

తాను అంబేద్క‌ర్, లింగ న్యాయంపై మాట్లాడుతున్నాన‌ని యూనిఫాం సివిల్ కోడ్ లో డీకోడ్ చేస్తూ ఆయ‌న ఆలోచ‌న ఏమిటో విశ్లేషించాల‌ని అన్నారు.

హిందూ మ‌తం మాత్ర‌మే మ‌తం. అదే జీవ‌న విధాన‌మ‌ని పేర్కొన్నారు. మరే ఇత‌ర విశ్వాసం దానిని అంగీక‌రించ‌ద‌న్నారు జేఎన్యూ వీసీ(JNU VC).

Also Read : ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా అదానిదే

 

Leave A Reply

Your Email Id will not be published!