Komatireddy Venkatreddy : తేల‌నున్న కోమ‌టిరెడ్డి భ‌విత‌వ్యం

స‌ర్దుబాటు చేయ‌డ‌మా సాగ‌నంప‌డ‌మా

Komatireddy Venkatreddy :  గ‌త కొంత కాలం నుంచీ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉన్నా ధిక్కార స్వ‌రాన్ని వినిపిస్తూనే వ‌స్తున్నారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఇప్ప‌టికే ఆయ‌న సోద‌రుడు మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 134 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆపై త‌న పార్టీకి సంబంధించి ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి , ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు.

ఆ వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఓకే చెప్పారు. ఇదిలా ఉండ‌గా కోమ‌టిరెడ్డిపై తీవ్ర ప‌ద‌జాలంతో అద్దంకి ద‌యాక‌ర్ దూషించ‌డం, రేవంత్ రెడ్డి వ్య‌క్తిగ‌త కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్ర దుమారం రేగింది.

ఇప్ప‌టికే మాజీ సీఎం త‌న‌యుడు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మ‌రో వైపు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkatreddy)  రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ కూడా చేశారు.

త‌నను పొమ్మ‌న‌కుండా పొగ పెడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ త‌రుణంలో పార్టీ హైక‌మాండ్ నుంచి కోమ‌టిరెడ్డికి ర‌మ్మంటూ పిలుపు వ‌చ్చింది.

ఆయ‌న రేవంత్ రెడ్డితో పాటు మాణిక్యం ఠాగూర్ ను కూడా దూషించారు. ఆపై తాము సోనియాకు విధేయులం అంటూనే ఇంకో వైపు బీజేపీ వైపు చూశారు.

ఈ త‌రుణంలో మేడం చేతిలోకి పంచాయ‌తీ వెళ్లింది. ప్రియాంక‌తో లేదంటే ఇత‌ర ముఖ్య నాయ‌కుల‌తో భేటీ కానున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ఢిల్లీలో ఉన్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబు. మొత్తంగా ఈ భేటీ ముగిశాక బుజ్జ‌గిస్తారా లేక సాగ‌నంపుతారా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!