Bihar Speaker : బీహార్ స్పీకర్ వీకే సిన్హా రాజీనామా
అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉంది
Bihar Speaker : భారతీయ జనతా పార్టీకి చెందిన బీహార్ స్పీకర్(Bihar Speaker) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. 17 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుబంధానికి తెర దించారు సీఎం నితీశ్ కుమార్.
ఆ మేరకు ఆయన ప్రతిపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ , ఇతర పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ పేరుతో కొత్త సర్కార్ ఏర్పాటు చేశారు. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ కొలువు తీరారు.
అనంతరం 31 మందితో కొత్త కేబినెట్ ను విస్తరించారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. అధికార పార్టీకి చెందిన సంకీర్ణ ఎమ్మెల్యేలు వీకే సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.
దీంతో ఆయన తన స్పీకర్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా స్పీకర్ పదవికి రాజీనామా చేసే ముందు బీజేపీకి చెందిన వీకే సిన్హా అంతకు ముందు శాసనసభ సమావేశాలు వాయిదా వేశారు.
నిబంధనల ప్రకారం స్పీకర్ రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీ వ్యవహారాలన్నీ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తారని మహేశ్వర్ వెల్లడించారు.
మహా ఘట్ బంధన్ కూటమి ప్రభుత్వం మెజారిటీని నిరూపించు కునేందుకు బలపరీక్షకు ముందు బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా శాసనసభా సభాపతి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
సీఎం నితీశ్ కుమార్ పార్టీకి చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ పేరును సిన్హా సిఫారసు చేశారు. ప్రస్తుతం బల పరీక్షకు ఆయన అధ్యక్షత వహిస్తారు.
విధాన సభ సెక్రటేరియట్ లో స్వీకరించిన మోషన్ నోటీసు అస్పష్టంగా ఉందని, నియమాలు పాటించా లేదంటూ రాజీనామా అనంతరం ఆరోపించారు.
Also Read : ఆప్ సైనికులు అమ్ముడు పోరు – సిసోడియా