CM KCR : లా అండ్ ఆర్డర్ ముఖ్యం – కేసీఆర్
ఎవరినీ ఉపేక్షించవద్దని ఆదేశం
CM KCR : బీజేపీ ఎమ్మెల్యే రాజాగా సింగ్ కామెంట్స్, ఎంఐఎం నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ అట్టుడుకుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ లా అండ్ ఆర్డర్ పై సమీక్ష చేపట్టారు.
లా అండ్ ఆర్డర్ ముఖ్యమని ఎవరినీ ఉపేక్షించ వద్దంటూ ఆదేశించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడినా లేక ప్రోత్సహించినా ఉక్కుపాదం మోపండని అన్నారు.
చట్టానికి భంగం కలిగిస్తే ఊరు కోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. మతం పేరుతో అల్లర్లకు పాల్పడే వారిని ఏకి పారేయండన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎలాంటి మత ఘర్షణలు, కులాల కొట్లాటలు జరగలేదని గుర్తు చేశారు కేసీఆర్.
ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడంపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు చెడగొట్టేందుకు యత్నించినా సహించ బోనంటూ స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR).
ఎంతటి వారైనా ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్నా సరే చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముస్లిం వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలకు దిగాయి.
దీంతో ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆయనను 10 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది. మరో వైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నిలిచి పోయింది.
ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇలాంటి సంఘటనల వల్ల దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం.
Also Read : లైగర్’ విజయ్ వన్ మేన్ షో – ఉమైర్ సంధు