India Votes Ukraine : రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు
ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటన
India Votes Ukraine : రష్యాతో సత్ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న భారత దేశం ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచీ భారత్ శాంతిని కోరుకుంటోంది.
ఈ మేరకు యావత్ ప్రపంచం ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిస్తూ వస్తోంది. తాజాగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
ఉక్రెయిన్ పై జరిగిన ఓటింగ్ లో ఆ దేశానికి మద్దతు పలికింది. యుద్దం అనివార్యం కాదని, అది విధ్వంసానికి దారి తీస్తుందని ప్రకటించింది. ఇప్పటికే ఇరు దేశాలు విరమణ పాటించాలని కోరింది.
ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్య ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
మరో వైపు భారత్ ఎటు వైపు ఉంటుందనే దానిపై చర్చ నెలకొంది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది అమెరికా, బ్రిటన్ , యూరప్ దేశాలు.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో విధాన పరమైన ఓటు సందర్బంగా భారత దేశం మొదటిసారి వ్యతిరేకంగా ఓటు (India Votes Ukraine) వేయడం కలకలం రేపింది.
ఇది ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘ కాలంగా సంబంధం కొనసాగిస్తూ వస్తున్న రష్యాకు కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు.
15 మంది సభ్యుల శక్తివంతమైన యున్ బాడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో ప్రసంగించేందుకు ఆహ్వానించారు.
కాగా అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యా దురాక్రమణ తర్వాత ఆర్థిక, ఇతర ఆంక్షలు విధించాయి.
Also Read : ఆయిల్ ధరల పరిమితిపై ఏకాభిప్రాయం అవసరం