Ashwini Vaishnaw : త్వరలో దేశంలో 5జీ సేవలు స్టార్ట్ – వైష్ణవ్
స్పష్టం చేసిన కేంద్ర టెలికాం శాఖ మంత్రి
Ashwini Vaishnaw : కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశానికి ఒక మంచి శుభవార్త చెబుతున్నట్లు ప్రకటించారు.
దేశంలో 5జీ సేవల ప్రారంభంపై కేంద్ర మంత్రి ఖుష్ కబర్ చెప్పారు. ఇదిలా ఉండగా ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి 5జీ సేవలను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ పై తన మొదటి కాల్ చేశారు. 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
అక్టోబర్ 12 లోగా లాంచ్ అవుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము 5జీ సేవలను వేగంగా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. టెలికాం ఆపరేటర్లు ఈ విషయంలో పని చేస్తున్నారని చెప్పారు మంత్రి.
ఇన్ స్టాలేషన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన నగరాలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.
ఆ తర్వాత నగరాలు, పట్టణాలలోకి విస్తరిస్తామని చెప్పారు అశ్విని వైష్ణవ్. వచ్చే రెండు మూడేళ్లలో దేశంలోని ప్రతి ప్రాంతంలో 5జీ అందుబాటు లోకి వస్తుందని తాము అంచనా వేస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి.
ఆ తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారిస్తోందన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖల జారీ తర్వాత 5జీ లాంచ్ తో సిద్దంగా ఉండాలన్నారు అశ్విని వైష్ణవ్.
Also Read : 13 నగరాలలో 5జీ సేవల విస్తరణ