Jharkhand CM : ప్ర‌జా బ‌లాన్ని కొన‌లేరు – హేమంత్ సోరేన్

త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తార‌న్నప్రచారంపై

Jharkhand CM : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న అక్ర‌మంగా మైనింగ్ లీజుకు త‌న పేరు మీద చేసుకున్నారంటూ రాష్ట్ర బీజేపీ గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసింది.

ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఎందుకు సీఎం శాస‌న‌స‌భ స‌భ్వ‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేయ‌కూడ‌దో చెప్పాలంటూ వివ‌ర‌ణ కోరారు. చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చంటూ స్ప‌ష్టం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

ఈ త‌రుణంలో ఏకంగా పెద్ద ఎత్తున గురువారం హేమంత్ సోరేన్ నివాసానికి జ‌నం తండోప తండాలుగా చేరుకున్నారు. రాష్ట్రంలో పోలీసుల‌కు ప‌రిహార సెల‌వుల‌ను ఆమోదించే ప్ర‌తిపాద‌న‌ను రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది.

ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ వీడియోను స్వ‌యంగా సీఎం పంచుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఒంటెద్దు పోక‌డ‌పై నిప్పులు చెరిగారు సీఎం హేమంత్ సోరేన్.

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం(Jharkhand CM). రాజ్యాంగ సంస్థ‌ల‌ను ఒక‌రు కొనుగోలు చేయ‌వ‌చ్చు. కానీ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో అది చేయ‌లేరంటూ ఘాటుగా బ‌దులు ఇచ్చారు.

జార్ఖండ్ లోని వేలాది మంది క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే పోలీసులు ఉన్నారు. అంత‌కంటే ప్ర‌జ‌ల ఆద‌రాభిమాన‌లు ఉన్నాయి. వారి మ‌ద్ద‌తు ఉన్నంత కాలం త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ప్ర‌క‌టించారు హేమంత్ సోరేన్.

జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ విజ‌య్ కుమార్ హ‌న్స్ ద‌క్ గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం జార్ఖండ్ స‌ర్కార్ ను అస్థిర ప‌ర్చాల‌ని చూస్తోందంటూ ఆరోపించారు. తాము కుట్ర‌ల‌ను ఛేదించుకుని ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తామ‌ని చెప్పారు.

Also Read : సోనాలీ ఫోగ‌ట్ హ‌త్య‌పై విచార‌ణ – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!