CM YS Jagan : సాఫ్ట్ స్కిల్స్ లో ఏపీ షాన్ దార్
35,980 మంది విద్యార్థులకు శిక్షణ
CM YS Jagan : ఏపీ సీఎం విద్యాధికుడు కావడంతో ఆయన ఎక్కువగా విద్యా రంగంపై ఫోకస్ పెడుతున్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక ప్రకటన చేశారు.
విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కటొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
ఇదంతా ఆయన చలవే. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే విద్యార్థులు చదువుకునేలా చేశారు. ప్రపంచంలో పేరొందిన ఐటీ రంగానికి చెందిన కంపెనీలతో ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుంది.
ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, ఇతర కీలక కోర్సులపై ఫోకస్ పెట్టేలా చేశారు.
ఇప్పటికే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన జగన్ రెడ్డి(CM YS Jagan) నాడు నేడు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా బడులను దేవాలయాలుగా మార్చారు.
అంతే కాదు ప్రతి విద్యార్థి ఆంగ్లంతో పాటు టెక్నాలజీలో కూడా రాటు దేలాలని జగన్ రెడ్డి ఆకాంక్షించారు. పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఇందులో మరో అపురూపమైన ఘట్టం చోటు చేసుకుంది ఏపీలో.
శుక్రవారం విశాఖ పట్టణంలో పర్యటన సందర్భంగా ఏయూ కాన్వొకేషన్ హాల్ లో మైక్రో సాఫ్ట్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు జగన్ రెడ్డి.
ఇందులో భాగంగా 35 వేల 980 మందికి పైగా ట్రైనింగ్ పొందారు సాఫ్ట్ స్కిల్ లో. రాష్ట్ర చరిత్రలో ఇదో నూతన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. చదువు ఒక్కటే మనిషిని గొప్ప వారుగా చేస్తుందన్నారు. బతికేందుకు కూడా ఆస్కారం కల్పిస్తుందన్నారు.
Also Read : ఆజాద్ సరే అసమ్మతి నేతల దారెటు