CJI UU Lalit : స్పీడ్ పెంచిన సీజేఐ జస్టిస్ లలిత్
ప్రయాణం..పుస్తకాలు చదవడం ఇష్టం
CJI UU Lalit : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన జస్టిస్ యుయు లలిత్(CJI UU Lalit) ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దూకుడు పెంచారు. తనదైన ముద్ర ఉండేలా స్పీడ్ పెంచారు.
జస్టిస్ లలిత్ కేవలం 74 రోజుల పాటు అంటే మూడు నెలల కాలం పాటు మాత్రమే ఉంటారు. వయస్సు రీత్యా తక్కువ కాలమే ఉండడంతో ప్రధానంగా గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన కేసుల పరిష్కారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు సీజేఐ.
48వ సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ 16 నెలల పాటు ఉన్నత పదవిని అద్భుతంగా నిర్వహించారు. సాధ్యమైనంత వరకు న్యాయ వ్యవస్థ పట్ల మరింత పటిష్టంగా, ప్రజలకు తెలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా 49వ ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన జస్టిస్ యుయు లలిత్(CJI UU Lalit) తన పూర్తి స్థాయి కాలాన్ని కేవలం కేసుల పరిష్కారంపై ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సత్వర న్యాయం అందించేందుకు గాను ఎక్కువ శాతం బెంచ్ లను ఏర్పాటు చేస్తానని చెప్పారు జస్టిస్ యుయు లలిత్. దీని వల్ల ఎక్కువ సంఖ్యలో పేరుకు పోయిన కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.
తనకున్న కాల పరిమితి తక్కువగా ఉండడంతో ఆయన వృత్తి పరంగా స్పీడ్ పెంచారు. 20 ఏళ్ల వయస్సులోనే లలిత్ న్యాయవాదిగా తన కెరీర్ స్టార్ట్ చేశాడు.
రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేయడం, పుస్తకాలను చదవడం అంటే ఇష్టపడే ఈ ప్రధాన న్యాయమూర్తి వెళ్లే లోపు చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు.
Also Read : స్మృతి వనం ప్రారంభానికి సిద్దం