Abdul Basit Khan : దీదీకి షాక్ బాసిత్ ఖాన్ గుడ్ బై

త్రిపుర ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి రాం రాం

Abdul Basit Khan : దేశ వ్యాప్తంగా రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల జ్వ‌రం ప‌ట్టుకుంది. 2024లో ఎవ‌రు గెలుస్తార‌నే దాని గురించి ప‌క్క‌న పెడితే ప్ర‌ధానంగా విప‌క్షాలు వ‌ర్సెస్ భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య‌నే కీల‌క‌మైన పోటీ ఉండ‌బోతోంది.

ఈ త‌రుణంలో ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన సీనియ‌ర్లు, కీల‌క‌మైన నేత‌లంతా త‌మ ఎదుగుద‌ల‌కు దోహ‌ద ప‌డిన పార్టీల‌ను వీడుతున్నారు. తాజాగా 50 ఏళ్ల అనుబంధాన్ని కాద‌ని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad).

మ‌రో వైపు దేశంలో త‌మ పార్టీని విస్త‌రించాల‌ని, మోదీకి తానే ప్ర‌త్యామ్నాయం అనే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తూ పావులు క‌దుపుతూ వ‌చ్చిన మ‌మ‌తా బెన‌ర్జీకి ఉన్న‌ట్టండి కోలుకోలేని షాక్ లు త‌గులుతున్నాయి.

ఇప్ప‌టికే కేంద్రం ప‌శ్చిమ బెంగాల్ ను టార్గెట్ చేసింది. త‌న ఆప‌రేష‌న్ లో ఇటీవ‌ల మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కూల్చింది. ఇక మ‌రో ఘ‌ట్టానికి తెర లేపింది జార్ణండ్ లో జేఎంఎం కూటమికి చెక్ పెట్టింది.

కూల్చే ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో దీదీకి(Mamata Banerjee) అనుంగు అనుచ‌రుడిగా పేరొందిన కేబినెట్ మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీపై ఈడీ దాడులు చేసింది.

ఆయ‌న స‌హాయ‌కురాలి ఇంట్లో రూ. 50 కోట్ల న‌గ‌దు 5 కేజీల బంగారం ప‌ట్టుకుంది. మంత్రితో పాటు ఆమెను అరెస్ట్ చేసింది. ఇక మ‌రో ప‌శువుల స్కాంలో కీల‌క‌మైన టీఎంసీ నేత‌ను అదుపులోకి తీసుకుంది.

బొగ్గు స్కాంలో కీల‌క అధికారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ త‌రుణంలో త్రిపుర టీఎంసీ యూనిట్ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న బాసిత్ ఖాన్(Abdul Basit Khan) తాను పార్టీని వీడుతున్న‌ట్లు డిక్లేర్ చేశారు.

Also Read : త‌ల్లి ఆశీర్వాదం త‌న‌యుడు సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!