Nitin Gadkari : వాడుకుని వదిలేస్తే ఎలా – గడ్కరీ
కేంద్ర మంత్రి కామెంట్స్ కలకలం
Nitin Gadkari : కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి గడ్కరీని తప్పించారు. రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది.
అంతే కాదు డైనమిక్ లీడర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) కు కూడా మోదీ త్రయం ఝలక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే యోగి సారథ్యంలో రెండో సారి యూపీలో ప్రభుత్వం కొలువు తీరింది.
ఈ సమయంలో నితిన్ గడ్కరీ పరక్షోంగా మోదీ సర్కార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు మంటలు రేపుతున్నాయి.
దేశంలో ఎన్నో వనరులు, సంపద కొలువుతీరి ఉందని కానీ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు మరో కీలక కామెంట్స్ చేశారు తాజాగా నితిన్ గడ్కరీ(Nitin Gadkari) . అవసరానికి వాడుకుని వదిలేస్తే పార్టీ కానీ సంస్థ కానీ ప్రభుత్వం కానీ తన మనుగడ సాగించ లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ఒక వ్యక్తి ఓడి పోయినప్పుడు పతనం కాడని కానీ తనను తాను పట్టించుకోని సమయంలోనే అంతం అవుతాడని అన్నారు నితిన్ గడ్కరీ.
ఇది పూర్తిగా మోదీని ఉద్దేశించి చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం , సినిమా రంగం, క్రీడా రంగం ఇలా రంగమైనా మానవ సంబంధాలే కీలకమైనవని పేర్కొన్నారు నితిన్ గడ్కరీ.
Also Read : దీదీకి షాక్ బాసిత్ ఖాన్ గుడ్ బై