CM KCR : కేంద్రంపై పోరాడేందుకు కేసీఆరే సరైనోడు
రైతు సంఘాల నేతల ఏకగ్రీవ తీర్మానం
CM KCR : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసినా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది.
ఇప్పటికే యూపీలోని లఖింపూరి ఖేరిలో 72 గంటల పాటు దీక్ష చేపట్టింది. రైతుల చావులకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ లోకి తొలగించాలని డిమాండ్ చేసింది.
ఈ తరుణంలో రైతులకు వెన్ను దన్నుగా ఉంటూ వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR). కేంద్రంపై పోరాడేందుకు రైతులను ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని, తమకు మద్దతు ఇవ్వాలని రైతు సంఘాలు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, కలిసి కట్టుగా కేంద్రంపై యుద్దం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. కీలక సమావేశం ముగిసిన అనంతరం రైతులకు సంబంధించి కీలకమైన పాలసీని రూపొందించాలని, దీనికి కేసీఆర్ కృషి చేయాలని పిలుపునిచ్చాయి.
వ్యవసాయ రంగాన్ని రక్షించాలని, రైతుల గౌరవానికి భంగం కలగకుండా చూడాలని కోరాయి. ఈ సందర్బంగా రైతు ఉద్యమానికి పార్లమెంటరీ మార్గంలో సమన్వయంతో సమిష్టి పోరాటం చేయడం ద్వారా రైతుల కష్టాలు, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించ వచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరాయి రైతు సంఘాలు. వ్యవసాయ, రైతు సంఘాలతో జరిగిన కీలక సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నడిచిన బాటలోనే రైతుల సమస్యలను పరిష్కరించు కునేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
Also Read : వాటికన్ లో కార్డినల్ గా హైదరాబాద్ బిషప్