Smriti Irani : స్మృతీ ఇరానీ ఫోన్ చేసినా నో రెస్పాన్స్

విచార‌ణ‌కు ఆదేశించిన యుపీ స‌ర్కార్

Smriti Irani : కేంద్ర మంత్రిగా కొలువు తీరిన స్మృతీ ఇరానీకి షాకింగ్ త‌గిలింది. ఆమె యూపీలోని లేఖ్ పాల్ కు ఫోన్ చేశారు. మంత్రి గొంతును గుర్తించ లేక పోయారు. స‌రిగా రెస్పాన్స్ ఇవ్వ‌లేక పోయారు.

దీంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమెథీ ఎంపీ ఫోన్ చేసినా గుర్తించ‌క పోవ‌డం దారుణ‌మ‌ని గుర్తించింది కేంద్రం. లేఖ్ పాల్ త‌న విధుల‌ను నిర్వ‌ర్తించ లేద‌నే అభియోగం కింద విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది యూపీ స‌ర్కార్.

ముసాఫిర్థానా త‌హ‌సీల్ ప‌రిధిలో లోని పూరే ప‌హ‌ల్వాన్ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ఆగ‌స్టు 27న కేంద్ర మంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. త‌న తండ్రి, టీచ‌ర్ మ‌ర‌ణించిన త‌ర్వాత‌, త‌న త‌ల్లి సావిత్రిదేవి పింఛ‌ను పొందేందుకు అర్హులు.

కాగా దీప‌క్ అనే క్ల‌ర్క్ ద్వారా వెరిఫికేష‌న్ పూర్తి కాక పోవ‌డంతో ఆమె పెన్ష‌న్ నిలిచి పోయింద‌ని క‌రుణేష్ ఆరోపించారు. ఈ విష‌యంపై సీరియ‌స్ గా స్పందించారు.

నేరుగా కేంద్ర మ‌హిళా , శిశు అభివృద్ది శాఖ మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani)  క్ల‌ర్క్ కు ఫోన్ చేశారు. కానీ స‌ద‌రు అధికారి ఆమె గొంతును గుర్తించ లేక పోయారు.

అమేథీ చీఫ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫీస‌ర్ (సిడిఓ) అంకుర్ లాథ‌ర్ లేఖ్ పాల్ దీప‌క్ అల‌స‌త్వ‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. త‌న విధుల‌ను స‌రిగా నిర్వర్తించ లేద‌ని పేర్కొన్నాడు.

స‌బ్ డివిజ‌న‌ల్ మేజిస్ట్రేట్ ముసాఫిర్థానాను విచార‌ణ‌కు కోరామ‌ని, ఆ త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని లాథ‌ర్ చెప్పారు.

Also Read : ఢిల్లీలో అర్ధ‌రాత్రి ఆప్..బీజేపీ హై డ్రామా

Leave A Reply

Your Email Id will not be published!