Haridwar Hate Speech : త్యాగి లొంగి పోవాల్సిందే – సుప్రీంకోర్టు
హరిద్వార్ ద్వేష పూరిత ప్రసంగం
Haridwar Hate Speech : హరిద్వార్ ద్వేష పూరిత ప్రసంగం కేసులో (Haridwar Hate Speech) నిందితులకు బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సెప్టెంబర్ 2 లోగా లొంగి పోవాలని ఆదేశించింది. ఈ విషయంపై సీరియస్ గా స్పందించింది.
వైద్య కారణాలతో త్యాగికి మూడు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత మే 17న ద్వేష పూరిత ప్రసంగాలకు పాల్పడబోనని , ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ లేదా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన ఇవ్వబోనని హామీ ఇచ్చారు. .
గతంలో వసీం రిజ్వీ అని పిలిచే త్యాగి ప్రస్తుతం మెడికల్ బెయిల్ పై బయట ఉన్నారు. ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన హరిద్వార్ ధర్మ సంసద్ కేసులో నిందితుడు జితేంద్ర నారాయాణ్ త్యాగి లొంగి పోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బీవీ నాగర్నతలతో కూడిన ధర్మాసనం వైద్య కారణాలపై గతంలో మంజూరు చేసిన బెయిల్ ను పొడిగించేందుకు నిరాకరించింది.
సెప్టెంబర్ 9న త్యాగి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను పరిశీలిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జితేంద్ర త్యాగికి రిలీఫ్ ఇచ్చేందుకు కారణం లేదు.
అతడిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అతడిని లొంగి పోమని చెప్పండి అంటూ న్యాయవాదికి సూచించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో తన బెయిల్ పిటిషన్ ను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టి వేసింది.
దీంతో త్యాగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 2న హరిద్వార్ కొత్వాలి లోని జ్వాలాపూర్ హరిద్వార్ నివాసి నదీమ్ అలీ ఫిర్యాదు మేరకు త్యాగితో పాటు ఇతరులపై కేసు నమోదైంది.
Also Read : మద్యం పాలసీపై అన్నా హజారే కామెంట్స్