Rape Cases Top : రేప్ కేసుల్లో రాజ‌స్థాన్..ఎంపీ..యూపీ టాప్

అత్య‌ధిక కేసులు ఆ రాష్ట్రంలోనే

Rape Cases Top : దేశంలోనే అత్య‌ధిక రేప్ లు (అత్యాచారాలు) జ‌రిగిన రాష్ట్రాల‌లో రాజ‌స్థాన్ టాప్ లో(Rape Cases Top) నిలిచింది. అత్య‌ధిక కేసులు న‌మోదైంది ఇక్క‌డే కావ‌డం గమ‌నార్హం.

విచిత్రం ఏమిటంటే అత్యాచారం కేసుల్లో సగానికి పైగా నిందితులు కుటుంబ స్నేహితులు, పొరుగు వారు లేదా తెలిసిన ఇత‌ర వ్య‌క్తులే అయి ఉండ‌డం దిగ్భాంతిని క‌లిగించే వాస్త‌వం.

ప్ర‌తి ఏటా దేశంలో క్రైమ్ రేటు ఏ విధంగా ఉంద‌నే దాని గురించి నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ ) వెల్ల‌డిస్తుంది. గ‌త ఏడాది 2021కి సంబంధించి తాజా నివేదిక వెల్ల‌డించింది.

ఇక ఎన్సీఆర్బీ తాజా రిపోర్టు ప్ర‌కారం దేశంలో అత్య‌ధిక అత్యాచార కేసులు రాజ‌స్థాన్ రాష్ట్రంలో 6,337 కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ధ్య ప్ర‌దేశ్ లో 2,947 రేప్ కేసులు, యూపీలో 2, 845 కేసులు, మ‌హారాష్ట్ర‌లో 2,496 కేసులు న‌మోద‌య్యాయి.

2020లో 5,310 అత్యాచారాలు న‌మోదైన రాజ‌స్థాన్ లో ఇటువంటి కేసులు 19.34 శాతం కేసులు పెర‌గ‌డం విస్తు పోయేలా చేసింది. 2021లో రాష్ట్రంలో 1,452 రేప్ కేసులు ఆరేళ్ల లోపు 18 మందితో స‌హా మైన‌ర్ల‌కు సంబంధించిన‌వే ఉన్నాయి.

60 ఏళ్లు పైబ‌డిన వారిపై నాలుగు అత్యాచార కేసులు న‌మోదు కావ‌డం విచిత్రం. రేప్ కేసుల్లో స‌గానికి పైగా నిందితులు కుటుంబానికి చెందిన వారు, పొరుగు వారు , లేదా ఇత‌ర తెలిసిన వ్య‌క్తులు ఉండ‌డం అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం.

ప్ర‌ధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ‌ల‌పై నేరాలు కూడా పెరిగాయ‌ని నివేదించింది. మ‌హిళ‌ల‌పై నేరాల విష‌యంలో యూపీ కూడా ఉంది.

Also Read : బ‌డులు అడిగితే వైన్ షాపులు తెరిచారు

Leave A Reply

Your Email Id will not be published!