Jairam Ramesh : జి-23 కూటమికి అంత సీన్ లేదు – జైరాం
పార్టీ ముఖ్యం ఆ తర్వాతే వ్యక్తులు
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తూ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కూటమి (జట్టు)కి అంత సీన్ లేదన్నారు కాంగ్రెస్ మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్(Jairam Ramesh).
జి-23 అన్నది ఒక ఊహ మాత్రమే. దానికి ముందు లేదు వెనుకా ఏమీ లేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న సదరు కూటమి గురించి తామేమీ ఆందోళన చెందడం లేదంటూ స్పష్టం చేశారు.
ఒక రకంగా జి-23లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కురువద్దుడు, మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) గుడ్ బై చెప్పారు. తన 50 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని వదులుకున్నారు.
ఆయనకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏఐసీసీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి కే పార్టీ అక్టోబర్ 17న ఎన్నికలు చేపట్టేందుకు నిర్ణయించింది.
అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. మరో వైపు జి-23లో కీలక నాయకుడిగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాతృభూమి పత్రికలో ఓ వ్యాసం రాశారు.
తాను కూడా ఏఐసీసీ చీఫ్ రేసులో ఉన్నానని వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష పదవితో పాటు ఇతర అన్ని పదవులకు కూడా ఎన్నికలు ఉండాలని, పూర్తిగా పారదర్శకతతో చేపట్టాలని సూచించారు.
దీనిపై జైరాం రమేష్ స్పందించారు. మొత్తంగా జి-23 అనేది ఒక కల అని దానికి ఎలాంటి ఆధారం లేదన్నారు.
Also Read : ఆజాద్ తో అసమ్మతి నేతల భేటీ