Ghulam Nabi Azad : ఆజాద్ తో అసమ్మతి నేతల భేటీ
ఆనంద్..పృథ్వీరాజ్..భూపిందర్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
ఆయనకు సపోర్ట్ గా జమ్మూ కాశ్మీర్ లో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు.
ఒక రకంగా కాశ్మీర్ లోయలో 134 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు జి23 కూటమికి చెందిన నాయకులు.
ఈ అసమ్మతి స్వరం వినిపించిన నాయకులలో తిరువనంతపురంకు చెందిన రాజ్యసభ ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాతృభూమి పత్రికలో ఏకంగా ఓ వ్యాసం రాశాడు.
తాను కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని వెల్లడించాడు. అంతే కాదు పార్టీ చీఫ్ పదవితో పాటు ఇతర పార్టీ పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు.
తాజాగా మరికొందరు సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ , పృథ్వీరాజ్ చౌహాన్ , భూపిందర్ హూడా గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) తో భేటీ అయ్యారు. వీరి సమావేశం తీవ్ర కలకలం రేపింది కాంగ్రెస్ పార్టీలో.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జి23 అన్నది ఓ కల అని దాని వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు.
Also Read : జి-23 కూటమికి అంత సీన్ లేదు – జైరాం