Nagarjuna Akkineni : నాగ్ పాలిటిక్స్ లోకి రానున్నారా

విజ‌య‌వాడ ఎంపీ బ‌రిలో న‌టుడు

Nagarjuna Akkineni : ఇటు ఏపీలో అటు తెలంగాణ‌లో రాజకీయాలు మ‌రింత వేడెక్కాయి. ఇప్ప‌టి నుంచే రాబోయే ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. ప్ర‌ధానంగా పార్టీల‌న్నీ సినీ రంగానికి చెందిన వారికి గాలం వేస్తున్నాయి.

గ‌తంలో దివంగ‌త ఎన్టీఆర్ ఏకంగా సీఎం అయ్యారు. ముర‌ళీమోహ‌న్, మోహ‌న్ బాబు, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణ‌, జ‌యసుధ‌, జ‌య‌ప్ర‌ద‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు న‌టులు రాజ‌కీయాల్లో కొన‌సాగారు.

కొంద‌రు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే మ‌రికొంద‌రు వాటికి దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్ గా మారారు అక్కినేని నాగార్జున‌. న‌టుడిగా ఇప్పటికే గుర్తింపు పొందినా బిగ్ బాస్ షోతో యాంక‌ర్ గా కొత్త అవ‌తారం ఎత్తారు.

ఆపై రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌తో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. త‌మ వ్యాపారాల‌కు అడ్డు లేకుండా ప్రీ ప్లాన్ గా ట్రై చేస్తూ త‌న ప‌ని కానిచ్చేస్తున్నారు.

ఈ త‌రుణంలో ఏపీలో ఇప్ప‌టి నుంచే ఏయే నియోజ‌క‌వర్గాల‌లో ఎవ‌రెవ‌రిని నిల‌బెట్టాల‌నే దానిపై వైసీపీ, టీడీపీ, బీజేపీలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నసేన పార్టీ పెట్టారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ సైతం న‌టీన‌టుల‌పై ఫోక‌స్ పెట్టింది.

టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్రబుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తో భేటీ కావ‌డం కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాజాగా వైసీపీ అక్కినేని నాగార్జున‌కు(Nagarjuna Akkineni) విజ‌య‌వాడ ఎంపీ సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే నాగ్ కు స‌మాచారం కూడా ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పార్టీలో పృథ్వీ రాజ్ , పోసాని కృష్ణ ముర‌ళి, ఆలీ ఉన్నారు.

Also Read : ప్రేమించే వాడి కోసం వేచి చూస్తున్నా – ట‌బు

Leave A Reply

Your Email Id will not be published!