BJP Target 350 : వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 350
మంత్రులకు అమిత్ షా వార్నింగ్
BJP Target 350 : భారతీయ జనతా పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తమ పార్టీకి చెందిన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు.
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 350 మంది ఎంపీలు గెలవాలని(BJP Target 350) టార్గెట్ గా నిర్ణయించారు.
ఆయా మంత్రులు, దేశంలోని పార్లమెంట్ నియోజకవర్గాలలోనే ఉండాలని ఆదేశించారు. ఏ మాత్రం తగ్గినా తాను ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పార్టీ ముఖ్యం.
ఆ తర్వాతే వ్యక్తులు. కార్యకర్తలు, నాయకులు, ఎంపీలు, మంత్రులు సమన్వయం చేసుకుంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు అమిత్ షా.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన వ్యూహకర్త అమిత్ షా(Amit Shah) మేధో మథన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలా పవర్ లోకి రావాలి.
ఏయే రాష్ట్రాలలో ఎన్నెన్ని సీట్లు కైవసం చేసుకోవాలనే దానిపై సమీక్ష జరిపారు. పార్టీ వల్లనే మేం ఉన్నాం. దాని వల్లనే మాకు పదవులు వచ్చాయి.
దాని వల్లనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. ఇదే సమయంలో మరో కీలక వ్యాఖ్యలు చేశారు షా. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అత్యంత జనాదరణ పొందారు.
ప్రధాని పేరు మీద ఎవరైనా గెలవవచ్చు. కానీ మైదానంలో బీజేపీ పార్టీకి బలం లేకుంటే ఏం చేయలేదు. గెలవాలంటే ముందు మనం కష్ట పడాలి. పార్టీని నిలబెట్టాలన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి.
ఇదిలా ఉండగా 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయిన 144 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
Also Read : భూపేన్ హజరికాకు గూగుల్ నివాళి