TTD : ఆ రోజుల్లో శ్రీ‌వారి ఆల‌యం బంద్

అక్టోబ‌ర్ 25, న‌వంబ‌ర్ 8న ద‌ర్శ‌నం క్లోజ్

TTD : ప్ర‌పంచంలోనే అత్య‌ధిక భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న దేవ దేవుడిగా భావించే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌రుడు కొలువైన తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది.

క‌రోనా కార‌ణంగా కొంత నెమ్మ‌దించినా ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రోజు రోజుకు భ‌క్తులు పోటెత్తుతున్నారు. 50 వేల మందికి పైగా ద‌ర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

బ్ర‌హ్మోత్స‌వాలకు ముస్తాబ‌వుతోంది తిరుమ‌ల‌. దీంతో ప్రివిలైజ్డ్ ద‌ర్శ‌నాల‌కు పుల్ స్టాప్ పెట్టింది. కేవ‌లం ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్ర‌మే ద‌ర్శ‌నం ఉంటుంది.

సామాన్యుల‌కే పూర్తి ద‌ర్శ‌నం కేటాయించాల‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD). ల‌క్ష‌లాదిగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు వ‌స్తార‌ని టీటీడీ అంచ‌నా వేస్తోంది.

అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, బోర్డు మెంబ‌ర్లు, మంత్రులు, వీవీపీలు, సెలిబ్రిటీలు, వ్యాపార‌వేత్త‌లకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం అంటూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

న‌డ‌క దారి నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌యారిటీ ఉంటుంద‌ని పేర్కొంది. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే అక్టోబ‌ర్ 25, న‌వంబ‌ర్ 8న చంద్ర‌హ‌ణం రానుంది.

దీని దృష్ట్యా ఆయా రోజుల్లో శ్రీ‌వారి ఆల‌యాన్ని 12 గంట‌ల పాటు మూసి వేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇవాళ ప్ర‌క‌టించింది టీటీడీ.

ఆ రోజు ఎలాంటి ద‌ర్శ‌నాలంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ముందుగా భ‌క్తులు గుర్తించాల‌ని సూచించింది. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 25న సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.17 గంట‌ల దాకా సూర్య గ్ర‌హ‌ణం ఉంటుంది.

ఆరోజు ఉద‌యం 8.11 నుంచి రాత్రి 7.30 గంట‌ల దాకా క్లోజ్ చేస్తారు. అన్ని ద‌ర్శ‌నాల‌తో పాటు ఆర్జిత సేవ‌లు కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది టీటీడీ.

Also Read : బ్ర‌హ్మోత్స‌వాల‌లో సామాన్యుల‌కే ద‌ర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!