Amit Shah Tour : షా టూర్ లో భద్రతా లోపం ఒకరు అరెస్ట్
పోలీసుల అదుపులో ఆంధ్రా ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి
Amit Shah Tour : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటన(Amit Shah Tour) ముగిసింది. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆయన టూర్ సందర్భంగా భద్రతా లోపం ఏర్పడింది.
ఇందుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆంధ్రా కేడర్ కు చెందిన అధికారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది.
కేంద్ర మంత్రికి పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రిత్వ శాఖ అధికారిగా నటిస్తున్న వ్యక్తి అమిత్ షా దగ్గరకు వచ్చాడు.
పట్టుపడక ముందే నిషేధిత ప్రాంతాల్లో స్వేచ్చగా తిరగడం గమనించారు. ఈ సంఘటనకు సంబంధించిన నివేదికలు ఇవాళ వెలువడ్డాయి.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు ముంబై పోలీసులు. అతడిని హేమంత్ పవార్ గా గుర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నట్లు ప్రాథమిక అంచనాలో తేలింది.
హోం మంత్రిత్వ శాఖ ఐడి కార్డు ధరించి గంటల తరబడి అమిత్ చంద్ర షా చుట్టూ తిరిగారని ఆరోపించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిగా అతడు కనిపించాడని పోలీసులు తెలిపారు.
అమిత్ షా హాజరైన రెండు కార్యక్రమాలలో హేమంత్ పవార్ ఉన్నాడు. అంతే కాకుండా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్ల వెలుపల కూడా కనిపించాడని పోలీసులు తెలిపారు.
అనుమానం వచ్చిన హోం మంత్రిత్వ శాఖ పవార్ ను ప్రశ్నించారు. అతడి పేరు షా సెక్యూరిటీ జాబితాలో లేదని తేలింది. అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 350