Edappadi Palaniswami : ఏఐడీఎంకే బాస్ గా ఈపీఎస్
కోర్టు ఆర్డర్ తో తిరిగి ఆఫీస్ కు
Edappadi Palaniswami : అన్నాడీఎంకే పార్టీ నీదా నాదా అన్న ఆధిపత్య పోరుకు కోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు మాజీ సీఎం ఎడాపొడి పళనిస్వామికి పవర్స్ (Edappadi Palaniswami) ఇచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు పార్టీ బాస్ గా ఈపీఎస్ అన్నాడీఎంకే కార్యాలయానికి తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా బల నిరూపణలో వంద లాది మంది పార్టీకి చెందిన కార్యకర్తలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎడప్పాడి పళనిస్వామికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దివంగత సీఎంలుగా పని చేసిన ఎంజీ రామచంద్రణ్, జయలలిత విగ్రహాలకు పళనిస్వామి నివాళులు అర్పించారు. ఈపీఎస్ గా పిలుచుకునే పళనిస్వామి తాత్కాలిక బాస్ గా అధికార పోరు కోర్టు జోక్యంతో ముగిసింది.
గురువారం తొలిసారిగా పార్టీ ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చారు. పెద్ద ఎత్తున తమ బలాన్ని ప్రదర్శించారు. పార్టీకి సంబంధించి ఎవరు బాస్ అనే దానిపై కోర్టుకు ఎక్కారు పన్నీరు సెల్వం, పళనిస్వామి.
గత వారం మద్రాస్ హైకోర్టు అంతకు ముందు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాయకుడిని , ప్రత్యర్థి మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బహిష్కరణను సబబే అని పేర్కొంది.
జూలై 11న అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఈపీఎస్ ఏకపక్షంగా ఏర్పాటు చేశారంటూ సింగిల్ జడ్జి బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 30 సమావేశానికి ముందు యథాతథ స్థితిని విధించింది.
అంతకు ముందు ఈపీఎస్, ఓపీఎస్ పార్టీపై పట్టు కోసం పోటీ పడ్డారు. చివరకు పార్టీ ఆఫీసుకు తాళం వేశారు.
Also Read : షా టూర్ లో భద్రతా లోపం ఒకరు అరెస్ట్