India Drops Rank : అభివృద్ధి సూచికలో భారత్ అధ్వాన్నం
129 నుండి 132కి పడిపోయిన ర్యాంక్
India Drops Rank : మానవాభివృద్ది సూచికలో భారత దేశం ర్యాంక్ మరింత దిగజారింది. గత ఏడాది 129వ ర్యాంకు ఉండగా ప్రస్తుతం అది 132కి పడి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే 3 ర్యాంకులు(India Drops Rank) వెనక్కి వెళ్లింది.
1990 నుండి భారత దేశ స్థాయి రాను రాను పడిపోతూనే ఉన్నది. కరోనా మహమ్మారి తర్వాత సాధారణ క్షీణత మధ్య భారత దేశం మానవ అభివృద్ది సూచికలో మరో ర్యాంక్ పడి పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
డిసెంబర్ 2020 చివరి ఇండెక్స్ లో ఇది రెండు ర్యాంకులు వెనుకకు మళ్లింది. 189 దేశాలలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఇండెక్స్ అనేది దేశాల జీవన కాలపు అంచనా.
విద్యా స్థాయితో పాటు సగటు జీవన ప్రమాణాలకు కొలమానంగా దీనిని భావిస్తారు. గ్లోబల్ ట్రెండ్ ల మాదిరిగానే మన దేశం విషయంలో 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది.
ఇక ఆయుర్దాయం – 69.7 నుండి 67.2 సంవత్సరాలకు తగ్గడానికి ఇది ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఇక భారత దేశంలోని పాఠశాల విద్య 11, 9 సంవత్సరాలు , పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 6,7 సంవత్సరాలు అని నివేదిక పేర్కొంది.
కాగా ఎప్పటి లాగానే మానావాభివృద్ది సూచికలో స్విట్జర్లాండ్ , నార్వే, ఐర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కరోనా మానవ పురోగతిని ఐదేళ్లు వెనక్కి నెట్టి వేసిందని నివేదిక వెల్లడించింది.
యున్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం 30 సంవత్సరాలలో మొదటిసారిగా 2020, 2021లో వరుసగా రెండేళ్ల పాటు సూచీ క్షీణించిందని ప్రకటించింది. ఈ ఎదురు దెబ్బ 90 శాతానికి పైగా దేశాలను ప్రభావితం చేసింది.
Also Read : ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ జూహీ కోర్ నోట్ వైరల్