Queen Elizabeth II : లోకాన్ని వీడిన క్వీన్ ఎలిజబెత్ – II

సుదీర్ఘ కాలం పాటు బ్రిట‌న్ కు రాణి

Queen Elizabeth II :  బ్రిట‌న్ లో సుదీర్ఘ‌కాలం పాటు పాలించిన చ‌క్రవ‌ర్తి క్వీన్ ఎలిజ‌బెత్ – II (Queen Elizabeth II) క‌న్ను మూశారు. ఆమె వ‌య‌స్సు 96 ఏళ్ల. ఎలిజ‌బెత్ 1837 నుండి 1901 వ‌ర‌కు పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును అధిగ‌మించింది.

2015 నుంచి ఎక్కువ కాలం ప‌ని చేసిన రాణిగా నిలిచారు. 1952లో సింహాస‌నాన్ని అధిరోహించిన క్వీన్ ఎలిజ‌బెత్ రాజ‌కీయ తిరుగుబాటు స‌మ‌యంలో యుకెకి నాయ‌క‌త్వం వ‌హించారు.

బ్రిట‌న్ ను ఆవిరి యుగం నుండి స్మార్ట్ ఫోన్ యుగానికి తీసుకు వెళ్లిన ఘ‌న‌త క్వీన్ ఎలిజ‌బెత్ కు(Queen Elizabeth II) ద‌క్కుతుంది. ఒక‌ప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించిన సామ్రాజ్యం చాలా వ‌ర‌కు శాంతియుతంగా విచ్చిన్నం కావ‌డాన్ని ప‌ర్య‌వేక్షించిన ఆమె మ‌ర‌ణించారు.

క్వీన్ ఎలిజ‌బెత్ సెప్టెంబ‌ర్ 8 మ‌ధ్యాహ్నం స్కాట్లాండ్ లోని బ‌ల్మోరల్ లోని త‌న ఎస్టేట్ లో ప్రశాంతంగా లోకాన్ని వీడిన‌ట్లు బ‌కింగ్ హామ్ ప్యాల‌స్ నుండి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

ఆమె భ‌ర్త ప్రిన్స్ ఫిలిప్ ఏప్రిల్ 2021లో 99వ ఏట మ‌ర‌ణించారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సార్వ‌భౌమాధికారి , అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డే త‌ల్లి మ‌ర‌ణించినందుకు ప్ర‌గాఢ సంతాపం తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు.

1997లో ప్రిన్సెస్ డ‌యానా మ‌ర‌ణంపై కుటుంబం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.  2012లో సింహాస‌నంపై 60 ఏళ్లు జ‌రుపుకున్న‌ప్పుడు అదే ఏడాది లండ‌న్ లో ఒలింపిక్ క్రీడ‌ల‌కు వేదికైంది.

ఇదే స‌మ‌యంలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క్వీన్ ఎలిజ‌బెత్ -2 ప్లాటినం జూబ్లీ 2022లో జ‌రిగింది.  ఆమె వార‌సుడు ప్రిన్స్ చార్లెస్ , అత‌డి మొద‌టి త‌న‌యుడు ప్రిన్స్ విలియం ఇద్ద‌రూ రాణికి నివాళులు అర్పించారు.

Also Read : ప్రిన్స్ ఎలిజ‌బెత్ స్థానంలో చార్లెస్

Leave A Reply

Your Email Id will not be published!