Prashant Kishor : బీహార్ సీఎంపై పీకే షాకింగ్ కామెంట్స్

రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలి

Prashant Kishor : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్(Prashant Kishor) కామెంట్స్ చేశారు. ఆయ‌న జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు. 17 ఏళ్ల పాటు బీజేపీతో క‌లిగి ఉన్న బంధాన్ని తెంచుకున్నారు.

ఆ వెంట‌నే ప్ర‌తిప‌క్షాల‌తో జ‌త క‌ట్టారు. జేడీయూ, కాంగ్రెస్, ఇత‌ర పార్టీల‌తో క‌లిసి మ‌హా ఘ‌ట్ బంధ‌న్ పేరుతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. 31 మందితో కేబినెట్ ను విస్త‌రించారు.

డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ కు చాన్స్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని(PM Modi), కేంద్ర ప్ర‌భుత్వాన్ని, బీజేపీని నితీశ్ ల‌క్ష్యంగా చేసుకున్నారు.

త‌న‌ను దెబ్బ కొట్టినందుకు ప్ర‌తీకారంగా ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తో పాటు సీపీఎం సీనియ‌ర్ నాయ‌కుడు సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.

ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి రేసులో లేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ స‌మ‌యంలో పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ నితీశ్ కుమార్(Nitish Kumar) ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఆయ‌న మోదీకి న‌మ‌స్క‌రిస్తున్న ఫోటోల‌తో దీనికి అర్థం ఏంటి అంటూ సీఎంను నిల‌దీశారు. తాను బీజేపీకి స‌హాయం చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు నితీశ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు పీకే. 12 నెల‌లు ఆగితే ఎవ‌రు ఏమిటో తేలుతుంద‌న్నారు.

Also Read : రాహుల్ గాంధీ యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!