Siddique Kappan : జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కు బెయిల్ మంజూరు
ఉత్తర్వులు ఇచ్చిన సర్వోన్నత న్యాయ స్థానం
Siddique Kappan : కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కు(Siddique Kappan) బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. గత 2020 నుండి ఉత్తర ప్రదేశ్ జైలులో ఉన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ ఈ సందర్భంగా మాట్లాడారు. జర్నలిస్ట్ కప్పన్ వచ్చే ఆరు వారాల పాటు ఢిల్లీలో, ఆ తర్వాత కేరళలలో పోలీసులకు రిపోర్ట్ చేస్తారని తెలిపారు.
ఈ దేశంలో ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్చ ఉందని స్పష్టం చేసింది కోర్టు. సిద్దిక్ కప్పన్ యూపీలో జరిగిన 19 ఏళ్ల గ్యాంగ్ రేప్ గురించి ప్రత్యేక కథనం కోసం కేరళ నుంచి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనకు తీవ్రవాదులతో, ఉగ్ర వాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. యూపీలోని హత్రాస్ కు వెళుతుండగా అరెస్ట్ చేశారు.
అతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా మలయాళ వార్తా పోర్టల్ అజీ ముఖం కు రిపోర్టర్ గా ఉన్నాడు సిద్దిక్ కప్పన్(Siddique Kappan). గతంలో కింది స్థాయి కోర్టులు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించాయి.
హత్రాస్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడంటూ పోలీసులు ఆరోపించారు. కప్పన్ కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు.
అయితే సిద్దిక్ కప్పన్ మాత్రం తాను నిర్దోషినని , కావాలని ఇరికించారంటూ ఆరోపించారు .
Also Read : కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో ఉన్నా – రాహుల్