Arvind Kejriwal : ఎల్జీ స‌క్సేనాతో సీఎం కేజ్రీవాల్ భేటీ

మ‌ద్యం పాల‌సీ స్కాం త‌ర్వాత స‌మావేశం

Arvind Kejriwal : కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్ర‌వారం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాతో భేటీ అయ్యారు.

మ‌ద్యం పాల‌సీ స్కాంకు సంబంధించి సీబీఐ కేసు న‌మోదు చేసింది. డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు 14 మంది ఉన్న‌తాధికారుల‌పై అభియోగాలు మోపింది.

సీఎం, ఎల్జీల మ‌ధ్య కీల‌క స‌మావేశం గ‌త ఆగ‌స్టు 12న స‌మావేశం జ‌రిగింది. వ‌రుస సోదాలు, ఆరోప‌ణ‌లు, కేసుల‌తో ఢిల్లీ రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప‌రిపాల‌నా స‌మ‌న్వ‌యం కోసం సీఎం ఎల్జీని క‌లుసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఆప్ ఎల్జీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. సీబీఐ దాడుల త‌ర్వాత గ‌త మూడుసార్లు దాట వేయ‌డంతో వారి సాధార‌ణ స‌మావేశం జ‌రిగింది. చివ‌రి సారిగా స‌మావేశ‌మైన త‌ర్వాత మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన ఫైలును తిప్పి పంపారు ఎల్జీ విన‌య్ కుమార్ స‌క్సేనా(Vinay Kumar Saxena).

మ‌ద్యం పాల‌సీలో స్కాంకు సాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. 14 గంట‌ల‌కు పైగా సోదాలు చేప‌ట్టింది. ఇది క‌ల‌క‌లం రేపింది.

ఎల్జీ వ‌ర్సెస్ సీఎం, ఆప్ నేత‌ల ఆరోప‌ణ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ రోజు జ‌రిగిన స‌మావేశంలో సాధార‌ణ పాల‌నా వ్య‌వ‌హార‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

ఇందుకు సంబంధించిన ఎజెండాను మీడియాతో పంచుకోలేదు సీఎం, ఎల్జీలు. ఇదిలా ఉండ‌గా ఎల్జీ కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా కేజ్రీవాల్, ఎల్జీ స‌క్సేనా భేటీ కావ‌డం క‌ల‌క‌లం రేగింది.

Also Read : ఇంట‌ర్నెట్ స‌స్పెన్ష‌న్ పై కోర్టు కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!