Sc Nupur Sharma : నూపుర్ శర్మపై పిటిషన్ తిరస్కరణ
అరెస్ట్ చేయాలని సుప్రీంలో పిటిషన్
Sc Nupur Sharma : మహ్మద్ ప్రవక్తను కించ పరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ బహిష్కత నాయకురాలు నూపుర్ శర్మ ను అరెస్ట్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు(Sc Nupur Sharma) తిరస్కరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని పిటిషనర్ కు సూచించింది.
ఇది చాలా సాధారణ హానికరం కాదు. కానీ ఇది చాలా దూరపు పరిణామాలను కలిగి ఉంది. ఉపసంహరించు కోవాలని సూచించారు. దీనిని కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం.
గత మార్చి 26న జాతీయ టెలివిజన్ లో ప్రవక్త పై నూపుర్ శర్మ(Nupur Sharma) చేసిన కామెంట్స్ ఈ ఏడాది ప్రారంభంలో దేశ వ్యాప్తంగా భారీ వివాదాన్ని రాజేసింది. హింసను రేకెత్తించాయి.
అనేక ముస్లిం దేశాలు కూడా తమ నిరసనను నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలకు బీజేపీ కూడా దూరంగా ఉండటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అంతకు ముందు సుప్రీంకోర్టు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి దేశ వ్యాప్తంగా నమోదైన కనీసం 10 ప్రథమ సమాచార నివేదికలను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది.
అదే సమయంలో బహుళ – రాష్ట్ర దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించంది.
ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ యుయు లలిత్. నూపుర్ శర్మ ను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఢిల్లీ హైకోర్టు. అప్పట్లో సంచలనం కలిగించింది.
Also Read : త్వరలోనే జపాన్..భారత్ విజన్ విడుదల