Vande Bharat Train : వందే భార‌త్ బుల్లెట్ ట్రైన్ రికార్డ్

52 సెక‌న్లలో గంట‌కు 100 కిలోమీట‌ర్లు

Vande Bharat Train :  మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వందే భార‌త్ బుల్లెట్ ట్రైన్(Vande Bharat Train) అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్ 52 సెక‌న్ల‌లో గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగంతో రికార్డు బద్ద‌లు కొట్టింది.

ఇదిలా ఉండ‌గా పూర్తిగా లోడ్ చేయ‌బ‌డిన వాట‌ర్ గ్లాస్ గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో క‌ద‌ల లేద‌ని తాము చూపించామ‌న్నారు. అది యావ‌త్ లోకాన్ని క‌దిలించింద‌న్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్.

కాగా సెమీ హై స్పీడ్ రైలు వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ అహ్మ‌దాబాద్ , ముంబై మ‌ధ్య ట్ర‌య‌ల్ ర‌న్ సక్సెస్ అయ్యింద‌న్నారు. గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగం అందుకోవ‌డం ద్వారా బుల్లెట్ రైలు రికార్డును బ‌ద్ద‌లు కొట్టింద‌ని పేర్కొన్నారు అశ్విని వైష్ణ‌వ్(Aswini Vaishnav).

వందే భార‌త్ రైలు మూడో సారి ట్ర‌య‌ల్ ర‌న్ పూర్త‌యింద‌ని , రైల్వే సేఫ్టీ క‌మిష‌న‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ తో భార‌తీయ రైల్వేకి ఇది గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణంగా మిగిలి పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

రైళ్ల‌ను త‌యారు చేయ‌డమే కాకుండా హై స్పీడ్ రైళ్ల‌ను న‌డిపేందుకు ట్రాక్ ల‌ను నిర్వ‌హించ‌డంపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి సారించింద‌న్నారు అశ్విని వైష్ణ‌వ్.

అయితే వందే భార‌త్ ట్ర‌య‌ల్ ర‌న్ పూర్త‌యినందు వ‌ల్ల మిగిలిన 72 రైళ్ల సీరియ‌ల్ ప్రొడ‌క్ష‌న్ త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు.

ఇక మూడో వందే భార‌త్ రైలు గ‌రిష్ట వేగం గంట‌కు 180 కిలోమ‌ట‌ర్లు. మొద‌టి త‌రం వందే భార‌త్ రైళ్లు గ‌రిష్టంగా 160 కిలోమీగా ఉంద‌న్నారు. ఇవి 54.6 సెక‌న్ల‌లో చేరుకుంటాయ‌ని చెప్పారు కేంద్ర మంత్రి.

Also Read : గేమింగ్ యాప్ కేసులో ఈడీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!