HD Kumara Swamy KCR : కేసీఆర్ తో కుమార స్వామి కీల‌క భేటి

తాజా రాజకీయ ప‌రిణామాల‌పై చ‌ర్చ

HD Kumara Swamy KCR : క‌ర్ణాట‌క మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumara Swamy KCR) ఆదివారం హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ను క‌లిశారు.

అనంత‌రం కీల‌క భేటీ జ‌రిగింది ఇద్ద‌రి మ‌ధ్య‌. వచ్చే నెల‌లో జ‌రిగే ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీని ప్ర‌క‌టించ బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో భాగంగా భావ సారూప్య‌త క‌లిగిన పార్టీలతో భేటీ అవుతూ వ‌చ్చారు కేసీఆర్. గ‌తంలో సీఎంలు, మాజీ సీఎంల‌తో ముచ్చ‌టించారు.

త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ మ‌మ‌తా బెన‌ర్జీ, భ‌గ‌వంత్ మాన్ , నితీశ్ కుమార్, తేజ‌స్వి యాద‌వ్ , అఖిలేష్ యాద‌వ్ , ఎంకే స్టాలిన్ , హేమంత్ సోరేన్ , అర‌వింద్ కేజ్రీవాల్ , ఉద్ద‌వ్ ఠాక్రే , త‌దిత‌ర నాయ‌కులు క‌లిశారు.

అదే స‌మ‌యంలో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన మాజీ ప్ర‌ధాన మంత్రి హెచ్ డి దేవగౌడ‌ను కూడా క‌లిశారు. మాజీ సీఎం ల‌లూ

ప్ర‌సాద్ యాద‌వ్ తో ముచ్చ‌టించారు.

దేశంలోని చిన్న పార్టీల మ‌ద్ద‌తుతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఒక సీరియ‌స్ వేదికను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే భావ సారూప్య‌త క‌లిగిన వారితోను చ‌ర్చించారు. మ‌రో వైపు త‌న వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ ప‌దును పెడుతూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి హెచ్ డి కుమార స్వామి న‌గ‌రానికి రావ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. దేశ రాజ‌కీయాల‌లో తాను చ‌క్రం తిప్ప‌డం

ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు కేసీఆర్.

ఇదే క్ర‌మంలో కుమార స్వామి క‌లుసుకున్నార‌ని స‌మాచారం. ఇక కేసీఆర్, కుమార స్వామి మ‌ధ్య ఎలాంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తంగా కొత్త పార్టీపైనే ఎక్కువ‌గా చ‌ర్చ‌కు రానుంద‌ని పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా.

Also Read : రూ. 1,020 కోట్ల‌తో టూరిజం పాల‌సీ – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!