Carlos Alcaraz : నా క‌ల నిజ‌మైంది – కార్లోస్ అల్క‌రాజ్

ఊహించ‌ని మ‌రిచి పోలేని విజ‌యం

Carlos Alcaraz : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుపొందిన అతి పిన్న‌మైన వ‌యస్కుడిగా చ‌రిత్ర సృష్టించాడు స్పెయిన్ కు చెందిన కార్లోస్ అల్క‌రాజ్. ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.

ప్ర‌తి ఒక్క‌రి క‌ల టైటిల్ గెల‌వ‌డం. నేను కూడా గెలుస్తాన‌ని అనుకోలేదు. కానీ నా అంతిమ క‌ల మాత్రం యూఎస్ ఓపెన్ చేజిక్కించు కోవ‌డం. దానిని నేను సాధించినందుకు ఆనందంగా ఉంది.

అంత‌కంటే ఎక్కువ‌గా సంతోషం క‌లిగిస్తోంద‌న్నాడు కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz). అంతే కాదు ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ ర్యాంకింగ్ తెచ్చుకుంటాన‌ని అనుకోలేద‌ని పేర్కొన్నాడు.

త‌న టెన్నిస్ కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. ఇది మామూలు విష‌యం కాదు. టెన్నిస్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డును న‌మోదు చేశాడు.

ఫైన‌ల్ లో నార్వేకు చెందిన కాస్ప‌ర్ రూడ్ ను 6-4, 2-6, 7-6 తేడాతో ఓడించాడు కార్లోస్ అల్క‌రాజ్. అత‌డి వ‌య‌స్సు ఇప్పుడు 19 ఏళ్లు.

2005 ఫ్రెంచ్ ఓపెన్ లో త‌న ఆరాధ్య దైవంగా భావించే రాఫెల్ నాద‌ల్ త‌ర్వాత అగ్ర ర్యాంకింగ్ ను క్లెయిమ్ చేసిన మొద‌టి ప్లేయ‌ర్ కార్లోస్ అల్క‌రాజ్.

1990లో పీట్ సంప్రాస్ త‌ర్వాత న్యూయార్క్ లో ఈ ఘ‌న‌త సాధించిన టెన్నిస్ ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. క‌ల‌లో కూడా అనుకోలేదు.

ఆ అనుభూతిని మాట‌ల్లో వ‌ర్ణించ లేనంటూ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఏం మాట్లాడాలో తెలియ‌డం లేద‌ని చెప్పాడు కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz). ఈ గెలుపును నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : సంజూకు అన్యాయం అభిమానుల ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!