Uday Samant : మ‌రాఠాకు గుజ‌రాత్ కంటే బెట‌ర్ ప్రాజెక్టు

ప్ర‌ధాన మంత్రి హామీ ఇచ్చార‌న్న మంత్రి

Uday Samant :  మ‌హారాష్ట్ర‌కు రావాల్సిన 20 బిలియ‌న్ డాల‌ర్ల చిప్ ఫ్యాక్ట‌రీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త కార‌ణంగా గుజ‌రాత్ కు త‌ర‌లి పోయింది. దీంతో శివ‌సేన దీనిని పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లింది.

ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ బాధ్య‌తా రాహిత్యం కార‌ణంగానే భారీ ప్రాజెక్టు మ‌రాఠాకు రాలేద‌ని ఆరోపించారు మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే.

దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది షిండే సంకీర్ణ స‌ర్కార్. ఒక‌వేళ చిప్ ఫ్యాక్ట‌రీ వ‌చ్చి ఉంటే మ‌హారాష్ట్రలో క‌నీసం ల‌క్ష మందికి ఉపాధి ల‌భించేద‌ని అన్నారు ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray).

ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ఉండ‌డంతో ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సి రావ‌డంతో వెంట‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి మొర పెట్టుకున్నారు.

ఎలాగైనా చిప్ ఫ్యాక్ట‌రీ గుజ‌రాత్ కు త‌ర‌లి పోతే దాని స్థానంలో త‌మ‌కు మంచి ప‌రిశ్ర‌మ వ‌చ్చేలా చూడాల‌ని కోరారు. ఈ విష‌యాన్ని మ‌రాఠా రాష్ట్ర మంత్రి ఉద‌య్ స‌మంత్(Uday Samant) వెల్ల‌డించారు.

రాష్ట్రానికి ఇలాంటి ప్రాజెక్టు లేదా అంత‌కంటే మెరుగైన ప‌రిశ్ర‌మ వ‌స్తుంద‌ని త‌మ‌కు పీఎం స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ని బుధ‌వారం చెప్పారు.

మ‌హారాష్ట్ర లోని థానేలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దీనికి గ‌తంలో కొలువు తీరిన మ‌హా వికాస్ అఘాడీ స‌ర్కార్ కార‌ణ‌మంటూ ఆరోపించారు.

ఈ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ప్ర‌ధాన మంత్రితో నేరుగా మాట్లాడార‌ని చెప్పారు. ఈ చిప్ ఫ్యాక్ట‌రీ మ‌హారాష్ట్ర‌కు రావాల్సి ఉంది.

ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు కూడా చేశారు. కానీ వేదాంత – ఫాక్స్ కాన్ కంపెనీ గుజ‌రాత్ ను ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ , తెలంగాణ‌, ఏపీ కోరాయి. చివ‌ర‌కు గుజరాత్ ను ఎంచుకున్నారంటూ మంత్రి తెలిపారు.

Also Read : పీకేను చూసి క‌ల‌త చెంద‌లేదు – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!