Robin Uthappa : క్రికెట్ కు రాబిన్ ఉత‌ప్ప గుడ్ బై

అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలిగా

Robin Uthappa :  భార‌త వెట‌ర‌న్ క్రికెట‌ర్ రాబిన్ ఉత‌ప్ప(Robin Uthappa) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

2007లో భార‌త జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ విజేతగా నిలించింది. ఆ స‌మ‌యంలో రాబిన్ ఉత‌ప్ప విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

అత‌డి స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. గుండ‌ప్ప విశ్వ‌నాథ్, రాహుల్ ద్ర‌విడ్ , కుంబ్లే, శ్రీ‌నాథ్ త‌ర్వాత అంత‌టి స్థాయిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చాడు రాబిన్ ఉతప్ప‌. భార‌త క్రికెట్ నుండి త‌ప్పుకుంటున్నట్లు తెలిపాడు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు రాబిన్ ఉత‌ప్ప‌. అద్భుత‌మైన బ్యాట‌ర్ గా గుర్తింపు పొందాడు. నా దేశం త‌ర‌పున ముఖ్యంగా క‌ర్ణాట‌క రాష్ట్రం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించినందుకు గ‌ర్వ ప‌డుతున్నాన‌ని పేర్కొన్నాడు.

నాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపాడు రాబిన్ ఉత‌ప్ప‌. అంతే కాదు 2021లో ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) టైటిల్ గెలుచుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో కూడా భాగంగా ఉన్నాడు ఉత‌ప్ప‌.

అంతే కాకుండా గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012 ,2014ఓ టైటిల్ గెలుచుకున్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో కూడా కీల‌క పాత్ర పోషించాడు రాబిన్ ఉత‌ప్ప‌(Robin Uthappa).

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే భార‌త్ త‌ర‌పున 46 వ‌న్డేల్లో 934 ర‌న్స్ చేశాడు. 13 టి20ల్లో 249 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల‌లో ఒక‌డు. 205 మ్యాచ్ ల‌లో 27 హాఫ్ సెంచ‌రీల‌తో 4,952 ర‌న్స్ చేశాడు రాబిన్ ఉతప్ప‌.

Also Read : గంగూలీ..జే షాకు సుప్రీంకోర్టు ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!