Nagaland Groups : నాగాలాండ్ గ్రూప్ లతో కేంద్రం ఒప్పందం
శాంతి నెలకొనేందుకు అడుగు ముందుకు
Nagaland Groups : నాగాలాండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ప్రక్రియపై విభేదాలను అధిగమించేందుకు నాగాలాండ్ గ్రూపులు ఒప్పందంపై సంతకాలు చేశాయి.
నిజమైన అవగాహనను కొనసాగించేందుకు తాము సంతకాలు చేసినట్లు నాగాలాండ్ గ్రూపులు(Nagaland Groups) వెల్లడించాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేశాయి. ఇదిలా ఉండగా అతి పెద్ద నాగా వర్గంతో కేంద్రం ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇసాక్ ముయివా నేతృత్వంలోని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్ఎస్సీఎన్) , ఫోరమ్ ఫర్ నాగా సయోధ్య (ఎఫ్ఎన్ఆర్) గొడుగు కింద ఏడు నాగా లాండ్ గ్రూపులు కొనసాగుతున్నాయి.
శాంతి ప్రక్రియపై విభేదాలను అధిగమించేందుకు మార్గాలను అన్వేషించేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 2009 నాటి సయోధ్య ఒడంబడిక ను గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి.
కలిసి పని చేసేందుకు సిద్దమయ్యాం. అన్ని రకాల సాయుధ హింసకు దూరంగా ఉంటామని , రాజకీయ సమూహాలు, సాధారణ ప్రజల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఆయా గ్రూప్ నాయకులు వెల్లడించారు.
తాము శాంతి, గౌరవానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కేంద్రంతో ఒప్పందం కారణంగా గత కొంత కాలంగా అపరిష్కతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు నాగాలాండ్ సంస్థల అధినేతలు.
సంతకం చేసిన నాగాలాండ్ నేతలు తమ విభేదాలను అంగీకరిస్తూనే చీలికలు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సహకారం ద్వారా మా విభేదాలను అధిగమించే మార్గాలను కొనుగొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే సమావేశాలలో సీఓఆర్ ఆధారంగా పని చేస్తామని తెలిపారు.
Also Read : పోషకాహార స్కాం అసెంబ్లీలో ఆగ్రహం