Supreme Court Hijab : హిజాబ్ కేసులో సుప్రీం కీలక కామెంట్స్
స్కూల్ యూనిఫాంపై సర్కార్ కే పవర్
Supreme Court Hijab : దేశ వ్యాప్తంగా సంచలంన రేపిన హిజాబ్ కేసు లో(Supreme Court Hijab) కీలక తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఇందుకు సంబంధించి స్కూల్ యూనిఫాం తప్పనిసరి చేసే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి 2022లో సర్క్యూలర్ జారీ చేసింది. దీనికి సంబంధించి కర్ణాటక విద్యా చట్టం లేదా విద్యా నిబంధనలకు సంబంధించి ఎలాంటి పట్టింపు లేదని ధర్మాసనం పేర్కొంది.
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ ను నిషేధించే అధికారం ఆ రాష్ట్రానికి లేదని వాదించారు. దీనిపై తీవ్రంగా తప్పు పట్టింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. వారికి ఉన్న పవర్స్ లేదా జారీ చేసిన సర్క్యులర్ ఏదైనా చట్ట బద్దమైన రూల్స్ ఉల్లంఘించిందని వాదించవచ్చు.
కానీ వారికి ఆ అధికారం లేదని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేసింది కోర్టు. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుదాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
హిజాబ్(Hijab) విధించడం అనేది రూల్స్ ప్రకారం చేసినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపింది. ఈ దేశంలో ఎవరైనా సరే వారి వారి మత విశ్వాసాలను గౌరవించే హక్కు ఉంది.
ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలలో చదివే వారు ఎవరైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది ధర్మాసనం. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు.
Also Read : లింగ వివక్ష నిజం ఉపాధికి దూరం